Telangana

సమాజ హితానికి ముందుండండి

గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ

కొత్త నాయకత్వ బృందానికి బాధ్యతలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి, సమాజ హిత కార్యక్రమాలలో పాల్గొనడానికి, సమాజానికి సానుకూలంగా తోడ్పడటానికి గీతం రోటరాక్ట్ క్లబ్ సదా ముందుండాలని ప్రముఖులు ఉద్బోధ చేశారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, విద్యార్థి నాయకత్వం, సమాజ సేవ, సామాజిక బాధ్యతను పెంపొందించే తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, రోటరాక్ట్ క్లబ్ నూతన సభ్యులకు పదవీ బాధ్యతలను అప్పగించింది.ముఖ్య అతిథి, జిల్లా రోటరాక్ట్ ఛైర్మన్ డాక్టర్ జి.ఎస్.ఎస్. ప్రకాష్, ఆత్మీయ అతిథి రొటేరియన్ జె. యోగేశ్వర్ రెడ్డి, ఇతర ప్రముఖ రోటరీ, రొటరాక్ట్ ప్రముఖులతో కలిసి సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో 2026-27 పదవీ కాలానికి బాధ్యతలు చేపట్టే కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో కొత్త సభ్యుల చేరిక, క్లబ్ నాయకత్వ బృందం యొక్క లాంఛన ప్రమాణ స్వీకారం జరిగాయి. అనంతరం బోర్డు పిన్నింగ్, వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ జరిగాయి. ఈ మైలురాళ్లు సమాజ భాగస్వామ్యం, సేవ, నాయకత్వ అభివృద్ధిపై దృష్టి సారించిన విద్యార్థి నేతృత్వంలోని కార్యక్రమాల నూతన అధ్యాయానికి నాంది పలికాయి.ఐరిస్ హైదరాబాద్ రోటరీ క్లబ్ సహకారంతో, గీతం హైదరాబాదులోని రొటరాక్ట్ క్లబ్, ‘స్వార్థం కన్నా సేవ మిన్న’ అనే రోటరీ నినాదాన్ని అనుసరించి, ఈ క్లబ్ విద్యార్థులలో స్వచ్ఛంద సేవ, జట్టు స్ఫూర్తి, సామాజిక బాధ్యత వంటి స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తో పాటు, ఇతర విశిష్ట అతిథులు, రోటరీ, రోటరాక్ట్ సభ్యులు హాజరయ్యారు.ఈ ప్రారంభోత్సవం, కొత్తగా నియమితులైన నాయకత్వ బృందానికి ఒక ఉజ్వలమైన యేడాదికి నాంది పలికింది. విద్యార్థులను బాధ్యతాయుతమైన నాయకులుగా, సమాజానికి చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడంపై ఇది నూతనంగా దృష్టి సారించింది.

admin

Recent Posts

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం

ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర  400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు మనవార్తలు ప్రతినిధి, మియాపూర్:…

3 hours ago

శేరిలింగంపల్లి టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గూడ లావణ్య నేత నియామకం

- నియామకం పత్రం అందజేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌ మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ రక్షణ సేన…

3 hours ago

బల్దియాలో టిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం

- ప్రజలకు మంచి పాలన అందేయడమే టీఆర్ఎస్ లక్ష్యం - రాజధాని రణభేరిలో కవిత మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి…

3 hours ago

​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ​ఫార్మా మరియు రసాయన పరిశ్రమలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ యంత్రాంగం, ఫ్యాక్టరీస్ మరియు…

4 hours ago

కొండాపూర్‌లో నెక్స్ట్ జెన్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్సెస్‌ ‘ట్రెవిటా’ను ప్రారంభించిన సైబర్ సిటీ*

హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…

21 hours ago

హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…

21 hours ago