హైదరాబాద్, అక్టోబర్ 23, 2026:
హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, “ట్రూ లగ్జరీ”(True Luxury) థీమ్‌తో రూపొందిస్తున్న అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘సైబర్ సిటీ ట్రెవిటా'(Cybercity Trevita)కు సంబంధించి కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఇవాళ ప్రారంభించారు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి, ప్రాజెక్ట్‌లోని జీవనశైలి వ్యవస్థలు, నివాస ప్రాంతాలు మరియు వసతులను నేరుగా పరిశీలించవచ్చు.
“ఇల్లు కొనుగోలు చేసే వారికి నిజమైన లగ్జరీ అంటే ఏమిటో ‘సైబర్ సిటీ ట్రెవిటా’ తెలియజేస్తుంది. అలాగే హైదరాబాద్ మార్కెట్‌లో ఇప్పటివరకు ఎన్నడూ చూడని జీవన అనుభూతిని అందించడానికి ఆర్కిటెక్చర్, డిజైన్ మరియు టెక్నాలజీ ఎలా కలిసి వస్తాయో ఇది చూపుతుంది” అని సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ – ఆపరేషన్స్ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.
సైబర్ సిటీ ట్రెవిటా అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. ఇందులో రూఫ్‌టాప్‌పై 35 ప్రపంచ స్థాయి సదుపాయాలతో కూడిన స్కైలైన్ డెక్, టెర్రస్ పూల్‌తో పాటు ఐదు అంతస్తులలో క్రీడలు మరియు వినోద కార్యక్రమాల కోసం 60 వేల చదరపు అడుగుల విశాలమైన క్లబ్‌హౌస్ వంటి అనేక ప్రత్యేకమైన జీవనశైలి హంగులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో 75 శాతం మేర స్థలం ఖాళీగా మరియు పచ్చదనంతో కూడి ఉండగా, మొత్తం ప్రాజెక్ట్‌లో 37 ల్యాండ్‌స్కేప్ సదుపాయాలు ఉన్నాయి. ట్రెవిటా ట్రూ లగ్జరీ దైనందిన జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఇల్లు కొనుగోలు చేసేవారు నేరుగా తెలుసుకోవడానికి ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రత్యక్ష అనుభూతిని ఇస్తుంది.
సైబర్ సిటీ ట్రెవిటాతో, హైదరాబాద్ నగర ప్రాంత ఇళ్ల యజమానులు కోరుకునే విలాసవంతమైన జీవనశైలి, సౌకర్యాలు, నాణ్యమైన మరియు పర్యావరణ హితమైన జీవనాన్ని అందించడంలో కంపెనీ తన ప్రమాణాలను మరింత పెంచుతోంది. విలాసవంతమైన ఇళ్లను కోరుకునే కొనుగోలుదారులకు హైదరాబాద్ అగ్రగామి నగరంగా మారుతున్న తరుణంలో, ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే మరియు దైనందిన జీవితాన్ని అద్భుతంగా మార్చే శాశ్వత నిర్మాణాలను రూపొందించడంపై సైబర్ సిటీ దృష్టి సారిస్తోంది.
హైదరాబాద్‌లో తొలిసారిగా ఓ డెవలపర్ ద్వారా ‘ట్రెవిటా’ ప్రాజెక్ట్‌లో Aurm సంస్థకు చెందిన రెండు అత్యాధునిక సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. ప్రతీ టవర్ ఎంట్రీ లాబీలో విలువైన వస్తువులను భద్రపరుచుకోవడానికి బయోమెట్రిక్ భద్రతతో కూడిన ఇన్సూరెన్స్ చేయబడిన ఔర్మ్ వాల్ట్స్ లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ELIVATE by Aurm అనే రోబోటిక్ పార్శిల్ డెలివరీ సిస్టమ్ ద్వారా ఈ-కామర్స్ డెలివరీలను ప్రత్యేక లిఫ్ట్ సిస్టమ్ ద్వారా నేరుగా చేరవేస్తారు. దీనివల్ల డెలివరీ ఏజెంట్లు లోపలికి రాకుండా నివారించవచ్చు. నివాసితుల గోప్యతను కాపాడవచ్చు మరియు సాధారణ లిఫ్ట్‌లపై భారాన్ని తగ్గించవచ్చు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు…
కార్మికుల ప్రాణాలకు భద్రతేది? పరిశ్రమల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెందుకు? సిగాచి ఘటన మరువకముందే సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు…
కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ రక్షణ రంగంలోని త్రివిధ…
రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి అధికారులకు ఎమ్మెల్యే గూడెం…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…