Telangana

హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా హియ్య వారి 6 వ బ్రాంచ్ ను హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని కోంపల్లిలో గ్రాండ్ లాంచ్ ఐయింది. కపుల్స్, పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే థీమ్, అద్భుతమైన రుచి దీని ప్రత్యేకత. అంతేకాదు మండి అంటే నాన్ వెజ్ మాత్రమే కాదు, ఇక్కడ వెజ్ కూడా అంతే ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈవెంట్ కు ఆహ్వానించిన గౌతమి చౌదరికి ధన్యవాదములు తెలిపారు. హైదరాబాద్ లో ఇంత క్రియేటివ్ థీమ్ తో హియ్యా స్పేస్ మండిని ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక్కడ నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ మిక్స్ అవ్వకుండా ఫుడ్ ని తయారు చేస్తారని తెలిపారు. మసాలాలు కూడా సపరేట్ గా తయారు చేస్తారని పేర్కొన్నారు. అలాగే ఒక్కసారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడరని, చాలా శుభ్రంగా కిచెన్ ను చూసుకుంటారని వెల్లడించారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ హియ్య స్పేస్ మండి ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. కొంపల్లి లో 6 వ బ్రాంచ్ గా హియ్య స్పేస్ మండి ప్రారంభం అవడం, అదీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మల్టిపుల్ థీమ్స్ తో వస్తున్న మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఫారెస్ట్ థీమ్, డైనోసార్ థీమ్ చూసాము. ఇటీవల అమీర్ పేట్ లో కొత్తగా స్పేస్ థీమ్ ను లాంచ్ చేశాము. ఇప్పుడు కోంపల్లిలో రెండవ బ్రాంచిగా ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.

కొత్త థీమ్ తో రావడం మాత్రమే కాదు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న ధరలలో మా రుచులను అందించడం మా ప్రత్యేకత అని పేర్కొన్నారు. అలాగే వెజ్, నాన్ వెజ్ ఎప్పుడు సపరేట్ గా వండుతామని  కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలతో మేము రావడంతో.. మరికొంతమంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. దానివలన సిటీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఓనర్స్ జశ్వంత్, లోకేష్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే దిల్సుఖ్ నగర్ మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుందని తెలిపారు. అన్ని బ్రాంచ్ లను ఆదరించినట్టుగానే కొంపల్లిలో ఉన్న బ్రాంచ్ ను ఆదరిస్తారని కోరారు.

admin

Recent Posts

కొండాపూర్‌లో నెక్స్ట్ జెన్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్సెస్‌ ‘ట్రెవిటా’ను ప్రారంభించిన సైబర్ సిటీ*

హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…

2 hours ago

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు…

2 hours ago

ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు?

కార్మికుల ప్రాణాలకు భద్రతేది? పరిశ్రమల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెందుకు? సిగాచి ఘటన మరువకముందే సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు…

2 hours ago

త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక భూమిక

కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ రక్షణ రంగంలోని త్రివిధ…

2 hours ago

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి

రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి  బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి  అధికారులకు ఎమ్మెల్యే గూడెం…

24 hours ago

నేటి టిఆర్ఎస్ రాజధాని రణబేరి నీ జయప్రదం చేయాలి – వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…

24 hours ago