Telangana

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి

రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి 

బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి 

అధికారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన

పోచారంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా గత మూడు సంవత్సరాలుగా కేవలం సారి మాత్రమే బోనస్ చెల్లించారని.. మిగిలిన 5 పంటలకు ఇప్పటివరకు చెల్లించలేదని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ముత్తంగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన సదుపాయాలను పరిశీలించి, ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా..

రైతులు పండించిన పంటను విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగాలని, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోపాటు వర్తించే బోనస్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు.

సన్న వడ్లకు క్వింటాలుకు రూ.2,961

ప్రభుత్వం ప్రకటించిన ధరల వివరాల ప్రకారం సన్న వడ్ల ఏ గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.2,461 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ కలిపి మొత్తం రూ.2,961 చెల్లించనున్నారు. రైతులు తమ పంటకు ప్రభుత్వం ప్రకటించిన ధరను పొందేలా కొనుగోలు కేంద్రాలు దోహదపడనున్నాయి.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ముత్తంగి చైర్మన్ బిక్షపతి, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, శివారెడ్డి, నరేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, రామచందర్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నేటి టిఆర్ఎస్ రాజధాని రణబేరి నీ జయప్రదం చేయాలి – వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…

2 hours ago

మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విజయానికి ప్రతీకగా, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం…

2 hours ago

దౌల్తాబాద్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి, పాల్గొన్న నీలం

నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద, అణగారిన వర్గాల ప్రజల కడుపు నింపిన…

8 hours ago

రామేశ్వరం బండలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

​ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ​వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం పటాన్‌చెరు…

8 hours ago

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న ముదిరాజ్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ, ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన..…

8 hours ago

అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో ఉద్గారాలను తగ్గించొచ్చు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అటవీ సంరక్షణ, సుస్థిర…

8 hours ago