నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నిజం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద, అణగారిన వర్గాల ప్రజల కడుపు నింపిన బహుజన వీరుడు పండుగ సాయన్న అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు,
గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర్ మండలం దౌల్తాబాద్ చౌరస్తా నుండి SSR గార్డెన్స్ వరకు జరిగిన ర్యాలీ లో ఆయన పాల్గొని తర్వాత అక్కడే జరిగిన పండుగ సాయన్న 174 వ జయంతి వేడుకలో పాల్గొని ప్రసంగించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజుల ఆరాధ్య దైవం పండుగ సాయన్న జయంతి ని అధికారికంగా ప్రకటించిన విషయాని గుర్తుచేశారు, రానున్న కాలంలో ముదిరాజులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు, పార్టీలు వేరైనా అందరూ ఐక్యం కావలసిన అవసరం ఉంది అన్నారు, అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, కొల్లాపూర్ శ్రీనివాస్, మహేష్, మండల సంఘం అధ్యక్షులు తలారి రాజేందర్, ఉప అధ్యక్షులు అంబటి అర్జున్, సర్పంచులు రమేష్, సుజాత సత్యం, కృష్ణ, రాజు, శ్రీనివాస్, ప్రవీణ్, గోపాల్, ఉప సర్పంచ్ ప్రసాద్, కృష్ణ, జిల్లా మాజీ ఫిషరిష్ చైర్మన్ గుణాల నర్సింలు, నాయకులు ఆంజనేయులు, పోచయ్య,మదారం రవి, యాదగిరి, సతీష్, ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం పటాన్‌చెరు…
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ, ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన..…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అటవీ సంరక్షణ, సుస్థిర…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన పండగల సాయన్న ముదిరాజ్ 174వ…
చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు…
సృజనాత్మకత, సినిమా నిర్మాణ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎల్లప్పుడూ రొటీన్ చదువులతో విసిగిపోకుండా, కాస్తంత…