మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన పండగల సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి పరిధి రాయదుర్గంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముదిరాజ్ జెండా ఆవిష్కరణ మరియు రాయదుర్గం గ్రామంలో పండుగ సాయన్న నినాదాలు తో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ పండగల సాయన్న ధైర్యసాహసాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తుచేశారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ సామాన్యులకు అండగా నిలిచిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటాలు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు.సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు.
ఈ గుర్తింపు ముదిరాజ్ సమాజంతోపాటు బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాలని, బీసీ వర్గాల ఐక్యత, సామాజిక చైతన్యం, సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద, అణగారిన వర్గాల ప్రజల కడుపు నింపిన…
ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం పటాన్చెరు…
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ, ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన..…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : అటవీ సంరక్షణ, సుస్థిర…
చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు…
సృజనాత్మకత, సినిమా నిర్మాణ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్న విద్యార్థులు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎల్లప్పుడూ రొటీన్ చదువులతో విసిగిపోకుండా, కాస్తంత…