Telangana

దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, ధర్మానికి విజయద్వారంగా నిలిచే విజయదశమి పండుగను పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం మైత్రి స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగ వేడుకల్లో భాగంగా తొలుత జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన షమీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి స్థానిక ప్రజాప్రతినిధులు, పురప్రముఖులతో కలిసి మైత్రి స్టేడియంలో నిర్వహించిన రావణాసుర దహన కార్యక్రమానికి హాజరయ్యారు. రావణాసుర దహనంతో చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ ధర్మం, ధైర్యం, న్యాయం, సత్యం వంటి సద్గుణాలకు ప్రతీక అని పేర్కొన్నారు. రావణాసుర దహనం మనలోని చెడు ఆలోచనలు, అహంకారం, అన్యాయాలను విడిచిపెట్టి మంచిని ఆచరించాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు.విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సరికొత్త విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగలను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవడం మన సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.దసరా వేడుకలతో మైత్రి స్టేడియం పండుగ శోభను సంతరించుకోగా, రావణాసుర దహన కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో సినీవారం 2026 ప్రారంభం

సృజనాత్మకత, సినిమా నిర్మాణ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎల్లప్పుడూ రొటీన్ చదువులతో విసిగిపోకుండా, కాస్తంత…

18 hours ago

వేముకుంట లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా శమీపూజ

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్‌లోని వేముకుంట గౌతమినగర్ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ…

1 day ago

విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి : నీలం మధు ముదిరాజ్..

-తెలంగాణ ప్రజల పెద్దపండుగ విజయదశమి  -తన స్వగ్రామం చిట్కుల్ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న నీలం  -వైభవంగా శావ ఉరిగేంపు, జమ్మి…

1 day ago

రవి, అనిల్ సేవాభావం

-దసరా వేళ అల్పాహారం ఏర్పాటు -మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : దసరా పండుగను పురస్కరించుకుని తెల్లాపూర్…

1 day ago

జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి : నీలం మధు ముదిరాజ్

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన నీలం హామ్ తుమారే సాత్ హై మధు అంటూ నీలంను ప్రోత్సహించిన ఖర్గే ఖర్గేకు…

2 days ago

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు…

3 days ago