Telangana

విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి : నీలం మధు ముదిరాజ్..

-తెలంగాణ ప్రజల పెద్దపండుగ విజయదశమి 

-తన స్వగ్రామం చిట్కుల్ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న నీలం 

-వైభవంగా శావ ఉరిగేంపు, జమ్మి చెట్టుకు పూజలు 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఈ విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం దసరా పండుగ పురస్కరించుకుని తన స్వగ్రామం పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆయన గ్రామ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.
ముందుగా వేణుగోపాల స్వామి ఆలయం నుంచి శావ తీసుకొని వెళ్లి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం అందరితో అలయ్ బలాయ్ చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా అని ఆ జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దసరా పండుగ రోజు తీసుకునే అలాయి బలాయి ద్వారా పేద ధనిక తారతమ్యం లేకుండా అందరి మధ్య స్నేహపూర్వక వాతావరణం అలవడుతుందన్నారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాక్షించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

రవి, అనిల్ సేవాభావం

-దసరా వేళ అల్పాహారం ఏర్పాటు -మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : దసరా పండుగను పురస్కరించుకుని తెల్లాపూర్…

2 hours ago

జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి : నీలం మధు ముదిరాజ్

ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన నీలం హామ్ తుమారే సాత్ హై మధు అంటూ నీలంను ప్రోత్సహించిన ఖర్గే ఖర్గేకు…

23 hours ago

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు…

2 days ago

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి…

2 days ago

వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం…

2 days ago

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి…

2 days ago