Telangana

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న ముదిరాజ్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీ సి-ఏ, ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న

విగ్రహం ఏర్పాటుకు సీఎం సానుకూల స్పందన..

ప్రజా పోరాట యోధుల చరిత్రకు గుర్తింపు ఇవ్వడం అభినందనీయం: నీలం మధు ముదిరాజ్

పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు..

అమ్మవారి విగ్రహం బహూకరించిన నీలం..

హైదరాబాద్‌ ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయన చరిత్రకు దక్కిన గొప్ప గౌరవమని ప్రజా పోరాట యోధుల జీవితాలను గుర్తించి, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యవేక్షణలో అధికారికంగా నిర్వహించిన 174 వ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం పట్ల నీలం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల హృదయాల్లో నిలిచిన పండుగ సాయన్నకు అధికారికంగా గుర్తింపు కల్పించిన ముఖ్యమంత్రికి నీలం మధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పండుగ సాయన్న వంటి ప్రజా పోరాట యోధుల చరిత్రను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, వారి జీవిత విశేషాలను యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సమాజంలో అన్యాయాలను ఎదిరించి, పేదల పక్షాన నిలిచిన మహనీయుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించవచ్చన్నారు.తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్న ప్రజల కోసం పోరాడిన వీరుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని వివరించారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో పేదలు, బలహీన వర్గాలు ఎదుర్కొన్న దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం ప్రజల్లో విశేష ఆదరణ పొందిందన్నారు.

ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న కథనాల ప్రకారం, సంపన్నుల నుంచి సంపదను తీసుకుని పేదలకు పంచేవాడిగా సాయన్న పేరు గావించారని అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పిలుచుకుంటారన్నారు.
పండుగ సాయన్న జీవితం సామాజిక న్యాయం, సమానత్వం, పేదల పట్ల బాధ్యత వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, బలహీనులకు అండగా నిలవడం, ప్రజల హక్కుల కోసం పోరాడడం వంటి అంశాలు సాయన్న చరిత్రలో కనిపిస్తాయని పేర్కొన్నారు. నేటి తరానికి ఆయన జీవిత విశేషాలను తెలియజేయడం ద్వారా సామాజిక బాధ్యత, సేవాభావం వంటి స్ఫూర్తిదాయకమైన విలువలను అందించవచ్చన్నారు.

పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ఈ దిశగా ఒక మంచి అడుగుగా అభివర్ణించారు.
ప్రజల కోసం పోరాడిన వీరుల జీవితాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని, పండుగ సాయన్న స్ఫూర్తి యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముదిరాజ్ సంఘం నాయకులు, ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

దౌల్తాబాద్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి, పాల్గొన్న నీలం

నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద, అణగారిన వర్గాల ప్రజల కడుపు నింపిన…

2 hours ago

రామేశ్వరం బండలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

​ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ​వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం పటాన్‌చెరు…

2 hours ago

అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులతో ఉద్గారాలను తగ్గించొచ్చు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అటవీ సంరక్షణ, సుస్థిర…

2 hours ago

రాయదుర్గంలో పండగల సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు

 మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన పండగల సాయన్న ముదిరాజ్ 174వ…

2 hours ago

దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు…

11 hours ago

గీతంలో సినీవారం 2026 ప్రారంభం

సృజనాత్మకత, సినిమా నిర్మాణ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్న విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎల్లప్పుడూ రొటీన్ చదువులతో విసిగిపోకుండా, కాస్తంత…

1 day ago