politics

రామ-లక్ష్మణులుగా ఉంటాం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అందరం కలిసి సమిష్టిగా ముందుకెళితే, ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి జన జాతర సభా సన్నాహక సమావేశం ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ గతంలో చోటు చేసుకున్న ఘటనలను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ ఎమ్ ఆర్ కార్యకర్తలు కలిసి సహకరించాలని కోరారు . నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తన అన్న లాంటివాడని ఇకపై తాము రామ,లక్ష్మణులవలె కలిసివుండి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ,ఇకపై పార్టీలో డబుల్ షూటర్లుగా పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎదుటి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ముఖ్య నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన జాతర సభకు మెదక్ పార్లమెంటు పరిధి నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

లక్షన్నర మెజారిటీ తీసుకొస్తాం

కాటా శ్రీనివాస్ గౌడ్

ఇక ఇద్దరం కలిసాం మెదక్ ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్షన్నర ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కృషి చేస్తానని ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి నీలం మధు అన్న గెలుపు కోసమే పాటుపడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఘటనలను తాము ఎప్పుడో మరిచిపోయామని, కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిన నీలం మధును గెలిపించుకోని, మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ అభ్యర్థికి కచ్చితంగా లక్షన్నర మెజార్టీ వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్యామ్ గౌడ్, నియోజకవర్గస్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago