ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన డాక్టర్ అర్షియా సేథి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
చట్టాలను మనం గౌరవిస్తే, అవి మనకు చట్టపరమైన రక్షణలను కల్పిస్తాయని, చట్ట ఉల్లంఘన తగదని ఫుల్ బ్రైట్ ఫెలో (రెండుసార్లు), విద్యావేత్త, కేఆర్ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అన్ మ్యూట్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ అర్షియా సేథి స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళలు విభాగం ఆధ్వర్యంలో ‘మౌనాన్ని వీడడం: నేటి భారతదేశంలో కళలు, చట్టం’ అనే అంశంపై ఆమె మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
డాక్టర్ సేథీ మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) గురించి సమగ్రమైన అవలోకనాన్ని అందించారు. ముఖ్యంగా సాహిత్య, సంగీత రచనలలో కాపీరైట్, భౌగోళిక సూచనలు (జీఐ), సంబంధిత మినహాయింపులపై దృష్టి సారించి, అనేక చారిత్రాత్మక న్యాయ కేసుల ద్వారా తన వాదనలను వినిపించారు. ఐపీఆర్ అనేవి పారిశ్రామిక, శాస్త్రీయ, సాహిత్య, కళా రంగాలలో మేధో కార్యకలాపాల నుంచి ఉత్పన్నమయ్యే సృజనలను రక్షించే చట్టపరమైన హక్కులని ఆమె వివరించారు. ఉద్యోగ కల్పన, ఆదాయ సృష్టి, ఆర్థిక వృద్ధిలో వాటి కీలక పాత్రను ఆమె విశదీకరించారు.
డాక్టర్ సేథీ కాపీరైట్, ట్రేడ్ మార్కులు, సాహిత్య దొంగతనం, పైరసీ వంటి మేధో సంపత్తి హక్కుల ముఖ్య రూపాలను వివరించారు. అలాగే, ప్రింట్, కొత్త మీడియా, కళలు, ప్రసార మాధ్యమాలు, చలనచిత్రాలు, నాటక కళలు, సంగీతం వంటి రంగాలను సృజిస్తూ, 1957 కాపీరైట్ చట్టం, దాని 2012 సవరణల గురించి చెప్పారు. కాపీరైట్ ను ‘హక్కుల సమూహం’గా ఆమె అభిర్ణించారు. ప్రచురించిన, ప్రచురించని అసలైన రచనలకు ఇది వర్తిస్తుందని, ఇందులో సానుకూల, ప్రతికూల హక్కులుంటాయని చెప్పారు. కష్టం, సృజనాత్మకత సూత్రాలతో పాటు వాస్తవికత యొక్క పరీక్షలను ఆమె వివరించారు.
కళా సంప్రదాయాలలో గురువుల హక్కులను, రచనలు గౌరవం పొందుతున్నప్పటికీ, ఏ వ్యక్తి కూడా ఒక కళారూపంపై గుత్తాధిపత్యాన్ని హక్కును కోరలేరని డాక్టర్ సేథీ స్పష్టీకరించారు. కాపీరైట్ కు మినహాయింపులను వివరిస్తూ, కళాకారుల నైతిక హక్కులు, క్రియేటివ్ కామన్స్, సక్రమ వినియోగం, కాపీరైట్ గడువు తీరిపోవడం వంటి అంశాలను డాక్టర్ సేథీ చర్చించారు.తొలుత, కార్యక్రమ సమన్వయకర్త వైష్ణవి అతిథిని స్వాగతించి, సభికులకు పరిచయం చేశారు. లలిత, ప్రదర్శన కళల విభాగానికి చెందిన డాక్టర్ లలిత సింధూరి, డాక్టర్ ఆదిశేషయ్య అతిథిని జ్జాపికతో సత్కరించారు.
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఎంటెక్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న…
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు.. అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 77 మీటర్ల జాతీయ జెండాతో…
పటాన్‌చెరులో ఘనంగా ముగిసిన 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు మనవార్తలు ప్రతినిధి…
జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం…
యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వైభవంగా గణతంత్ర వేడుకలు మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: గణతంత్ర దినోత్సవం అనేది కేవలం…