– 500 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించదంలో శేరిలింగంపల్లి మండలం, అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తిర్ణత సాధించడం తో పాటు 13 మంది విద్యార్థులు 600 కు గాను 500 కు పైగా మార్కులు సాధించి సత్తా చాటారు.మార్కెట్ లో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడి, కార్పొరేట్ స్కూల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఫలితాలు సాధించి చూపారు. 40 మంది విద్యార్థులకు 40 మంది ఉత్తీర్ణత సాధించి, తామేమి తక్కువ కాదని నిరూపించారు. అంకిత భావం గల అధ్యాపక బృందం, ముందు చూపు, పట్టుదల గల కరస్పాండెంట్ త్రిమూర్తులు సార్ పర్యవేక్షణ లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని విద్యార్థులు తెలుపగగా, విద్యార్థుల కృషి, ఏకాగ్రత, ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలనే విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయ బృందం అంకితభావం కూడా ఈ ఫలితాలు రావడానికి కారణం అయ్యాయని, అందరి కృషి వల్లే విజయం సాధ్యం అయిందని త్రిమూర్తులు తెలిపారు. ఇదే స్ఫూర్తి తో మరింత ఉత్సాహంగా పని చేస్తామని, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు, అందుకు సహకరించిన తల్లిదండ్రులకు, స్కూల్ అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…