మనవార్తలు , అమీన్ పూర్
హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఠాకూర్ సింగ్ పై గిరిజనులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. హ్యుమన్ రైట్స్ కన్సుమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ ఛైర్మన్ పేరుతో తన కారుకు బోర్డు తగిలించుకుని దర్జాగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని లంబడా విస్తావత్ రవి నాయక్ ఫిర్యాదు చేశారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని అయిలాపూర్ తాండలో పేద ప్రజలైన గిరిజనులను హ్యుమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని కమీషన్ కు ఫిర్యాదు చేశారు .
అయిలాపూర్ తాండలో గిరిజనుల భూములను ప్రభుత్వ భూములంటూ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ చైర్మన్ పేరుతో లేఖలు రాస్తూ బెదిరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో వివరించారు. గతంలో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించిన కేసు నమోదైనట్లు తెలిపారు. ఏకంగా మానవ హక్కుల కమీషన్ తనకు క్లిన్ చీట్ ఇచ్చిందని HRC నే తప్పుదోవబట్టించిన ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు గిరిజనులు తెలిపారు. ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పైన ఎంక్వైరీ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హ్యూమన్ రైట్స్ పేరుతో బ్లాక్ మెయిల్స్ కు పాల్పడుతున్న వారిపైన పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ కన్సుమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ చైర్మన్ ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ బాధితులంతా బయటికి రావాలని పిలుపునిచ్చారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…