– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు
పటాన్ చెరు:
గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో వారి మార్గనిర్దేశనం ఉపకరించగలదని ఆయన ఆశాభావం . వెలిబుచ్చారు , వారి అనుభవం , దార్శనికత గీతను గొప్ప సంపదగా ఆయన అభిప్రాయపడ్డారు . ముగ్గురు ప్రముఖుల గురించి క్లుప్తంగా విశాఖలోని అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్వ వ్యవస్థాపకుడు , కార్యదర్శిగా సేవలందించిన తపోవర్ధన్ ఓ ఉద్వేగభరితమైన విద్యావేత్త , రెండు దశాబ్దాలుగా అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం , నిర్వహణలతో పాటు దాతృత్వంలో కూడా పేరొందారు .
రహదారులు , వంతెనలు , భవన నిర్మాణంలో నాలుగు దశాబ్దాల విశేష అనుభవం గల ఎమ్మార్కే ప్రసాద్ , అయా ప్రభుత్వాలు తమ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు . బహుళ ప్రాజెక్టుల నిర్వహణ , వాటిని సకాలంలో పూర్తిచేయడంలో పేరొందారు . నియత్నాం , స్విట్జర్లాండ్ తో పాటు మనదేశంలో కూడా కర్మాగారాలున్న బహుళ జాతి కంపెనీకి నాయకత్వం వహిస్తున్న చల్లా రాజేంద్రప్రసాద్ , దాతృత్వంతోపాటు ఆధ్యాత్మికతలో కూడా తన నిబద్ధతను చాటుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…