Hyderabad

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి – రేవంత్ రెడ్డి

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి …    -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
– పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
– వారు డబ్బుకు అమ్మడు పోయారని ఆరోపణ
– వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్

హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి నాయకులను రాళ్లతో కొట్టాలని అన్నారు. తమ పార్టీని వదిలి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు పోరాడతామని చెప్పారు.

ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికలకు రావాలని అన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుబోయారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు .
హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను ఈరోజు రేవంత్ కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ…… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి
కాంగ్రెస్ పార్టీ టిక్కర్ పై గెలిచి అధికార టీఆర్ యస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల లు తిరిగి స్వంతగూటికి చేరుకుంటారా? రేవంత్ మంత్రాంగం పనిచేస్తుందా ? ఇప్పటికే ఒకరిద్దరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అట్టివారిలో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంతకు ముందు ఒకసారి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరారు. తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అందువల్ల ఆయన కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ పై ఒంటికాలుతో లేచిన దానం అనుహ్యంగా టీఆర్ యస్ చేరారు. ఆయన అక్కడ మంత్రి పదవిని ఆశించారు. కానీ అది దక్కలేదు దీంతో ఆయన అక్కడ ఉండలేక పోతున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ నుండి తెరాసలో చేరిన ఒక సబిత ఇంద్రారెడ్డి తప్ప మిగతా వారికి సరైన న్యాయం దక్కలేదు . పార్టీలో సీనియర్లను కలుస్తూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. మరికొందరిని అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది. కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలకు వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి వస్తారా ? లేక వారిపై అనర్హత వేటు వేయించగలరా ? అనేది చూడాల్సి ఉంది.

Venu

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago