పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నా దేహం కన్నా దేశం గొప్పది’ అని నినదించిన త్యాగశీలి షాహిద్ “భగత్ సింగ్ శ్రీబాలాజీ ఫౌండేషన్ చైర్మన్ ,బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు “బలరాం అన్నారు . భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగారామచంద్రపురం లోని 112” డివిజన్ సాయి నగర్ కాలనీలో షాహిద్ “భగత్ సింగ్” గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం,భరతమాత స్వేచ్ఛ కోసం ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడిన వీరతేజం,ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారతీయుల గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన సింహనినాదం,“నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను చంపలేరు” అంటూ ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని పుట్టించిన విప్లవ కెరటం షహీద్ భగత్ సింగ్ అని తెలిపారు. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంతోష్ గారు, యాదగిరి గారు, మల్లేష్ గారు, ప్రవీణ్ గారు, కుమార్గారు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…