మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చెయ్యాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి. పాండురంగా రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమవద్ద సోమవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చెయ్యాలని, ఢీల్లీలో ఆందోళన చేస్తున్న యువత పై చేస్తున్న నిర్బంధాన్ని వెంటనే ఆపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. ప్రదీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్. సత్తిబాబు, కమిటీ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…