విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంగా గత వారపు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా మూసాయి. అనంతరం విజేతలకు పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి క్రీడోత్సవాలకు పటాన్చెరు వేదిక చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ మాట్లాడుతూ..కోకో, వాలీబాల్, కబడ్డీ అంశాల్లో అండర్ 17, అండర్ 14 విభాగాల్లో క్రీడలు నిర్వహించామని తెలిపారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన జట్లను రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌసుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయులు షర్ఫుద్దీన్, ఆసిఫ్, కిష్టయ్య, రామరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…