_భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఈ ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతున్నాం
_పిస్తా హౌస్ నిర్వాహకులు క్రాంతి కుమార్, రాఘు.
మనవార్తలు ,పటాన్ చెరు;
ముత్తంగి పిస్తాహౌస్ వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మేరకు తన కార్యాలయంపై ఈ నెల పన్నెండు వ తేదీన దాదాపు నలభై మంది గూండాలు దాడి చేసి ఎనిమిదిలక్షల నగదు అపహరించి ఇరవై లక్షల మేర ఆస్తులు ధ్వంసం చేశారని పిస్తా హౌస్ భవన యజమాని గోపాల్ గురువారం ముత్తంగి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు 2019లో శ్రీనిధి మానవి ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన క్రాంతి కుమార్, రాఘు లు తన భవనంలో పిస్తా హౌస్ పెట్టటానికి పదిహేను సంవత్సరాలు ఒప్పందం చేశారన్నారు కేవలం మూడు నెలలు మాత్రమే కిరాయి చెల్లించి అనంతరం కిరాయి చెల్లించకుండా ఇబ్బందులు గురి చేశారని కేసీఆర్ అన్న కుమారుడు పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని ఈ నేపధ్యంలో తన కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఈమేరకు కేసు నమోదైందని తెలిపారు.
కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పిస్తా హౌస్ నిర్వహిస్తున్నారని తనకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు దీనిపై పిస్తాహౌస్ నిర్వాహకులు క్రాంతి కుమార్, రాఘు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇస్తూ భవన యజమాని గోపాల్ వేధింపులు,కరోనా కారణాల రీత్యా చాలాకాలం పిస్తాహౌస్ మూసేశామని ఫలితంగా కోట్ల మేర నష్టపోయి తమ ఆస్తులు కూడా అనుకున్నామన్నారు. కెసిఆర్ అన్న కుమారుడి కి ఈ వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. భవన యజమాని కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో తమ పాత్ర లేదన్నారు. భవన యజమాని వేధింపులు తాళలేకే తాము కోర్టును ఆశ్రయించామని కోర్టు ఈ ఆదేశాల మేరకే తాము ముందుకు సాగుతామని ఈసందర్బంగా వారు తెలిపారు.
64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పరిశ్రమ అవసరాలకు…
చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…
భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా…