మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని యువజన వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు ఏర్పాటు చేసిన 77 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన, ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి, సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్‌చెరుశాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేసిన మహోన్నత నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరిని అన్నారు. ఆయన జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యువజన వికాస సమితి అధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పృథ్వీరాజ్, శ్రీధర్ చారి, రుద్రారం శంకర్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…
దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…