ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు, అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిళ్ల పరిధిలోగల డివిజన్లలో మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్ సర్కిల్, పటాన్‌చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ కు అధికారులు అందించారు. ఇటీవల బల్దియా పరిధిలో నూతనంగా ఏర్పడిన బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, ముత్తంగి, జేపీ కాలనీ, బీరంగూడ డివిజన్ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ప్రధానంగా సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మంజూరైన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 27న భారతి నగర్, రామచంద్రపురం, 28న పటాన్‌చెరు డివిజన్ల పరిధిలో 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ సమావేశంలో పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ సురేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ , ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, ఏఈలు సునీల్, శివ, దివ్యతేజ, లావణ్య, తేజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…
దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…