Crime

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…

పటాన్ చెరు:

ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక వేల్ తరచూ భార్య తో గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన భార్య భర్తలు ఇద్దరు గొడవ పడడం తో కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మేకవేల్ తను రాయ్ కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో బుధవారం ఉదయం భార్య తలపై కొట్టగా, రాజేశ్వరి పెద్దగా అరిచింది, దీంతో ఇంటి నుండి భర్త పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago