అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పటాన్ చెరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, దిశా నిర్దేశం చేసిన పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరుందిన పటాన్ చెరులో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాలుగా కృషి చేయడం మూలంగానే నేడు కళాశాల ఏర్పాటు అయ్యిందని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన కళాశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్ తో పాటు సరిపడా సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కళాశాలకు శాశ్వత ప్రతిపాదికన భవనం ఏర్పాటు చేసేందుకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కళాశాల సైతం ఏర్పాటు చేసేలా భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యసిద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, తదితర సామాజిక రుగ్మతలను తరిమికొట్టడంలో విద్యార్థులు కీలక భూమిక పోషించాలని కోరారు.హాజరైన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విజయ కుమార్, పిఎస్ఎస్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాగరాజు, బాబా వలి, వెంకటేష్, భోజయ్య, అశోక్, రాజు, షకీల్, రామిశెట్టి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…