Telangana

ఎగిరిన డ్రోన్, పెరిగిన ఆత్మవిశ్వాసం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

డ్రోన్ బూట్ క్యాంపు నాలుగో రోజు, గీతం విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీపై స్వీయ అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు, వాటిని ఎగరవేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిపుణుల మార్గదర్శనంలో, ఏడు క్వాడ్ ఎక్స్ కాప్టర్లను విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్ నిర్మాణం, పనితీరు పరీక్షలో విలువైన ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు.జీపీఎస్ ఆధారిత హెక్సాకాప్టర్ ను ఎగరవేయడానికి విద్యార్థులకు అవకాశం ఇచ్చారు. ఇది పరిశ్రమ స్థాయి డ్రోన్లలో ఉపయోగించే అధునాతన నావివేషన్, విమాన స్థిరీకరణ, నియంత్రణ వ్యవస్థలను తెలుసుకునే వీలు కల్పించింది. దీనికి అదనంగా, ప్రాథమిక విమాన నియంత్రణలు, యుక్తి పద్ధతులను అర్థం చేసుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బుల్లి (నానో) డ్రోన్ ఫ్లయింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.రోజంతా, విద్యార్థులు డ్రోన్ అసెంబ్లీ, క్రమాంకనం, విమాన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న వైమానిక సాంకేతికతల పట్ల ఆసక్తి, సాంకేతిక ఉత్సుకత, ఉత్సాహాన్ని ప్రదర్శించారు.మొత్తంమీద, డ్రోన్ బూట్ క్యాంపు పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించడమే గాక, డ్రోన్ సాంకేతికతలో సైద్ధాంతిక జ్జానాన్ని, వాస్తవ-ప్రపంచ వినియోగం మధ్య ఉన్న అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ బలోపేతానికి పటాన్ చెరులో కీలక నాయకుల చేరిక

-పటాన్ చెరులో బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన -హరీష్ రావు నాయకత్వంపై నమ్మకంతో కీలక నేతల భారీ చేరిక -నియోజకవర్గ రాజకీయాల్లో…

1 hour ago

వికలాంగులను చైతన్యపరిచే విధంగా ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయం

గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ వర్మ ఎన్ పి అర్ డి క్యాలెండర్ ఆవిష్కరణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

4 hours ago

మెదడుకు పదునుపెట్టిన సాంకేతికోత్సవం

గీతంలో ఎపోచ్ 4.0 పేరిట మూడు రోజుల సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం…

4 hours ago

వ్యర్థాల నిర్వహణకు ఐటీసీ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం వాణి

ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం _ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

2 days ago