Telangana

కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి_ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ 18 వ జాతీయ మహాసభలలో సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన చుక్క రాములు కు బుధవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. వెనిజులాపై అత్యంత పాశవికంగా దాడిచేసి అధ్యక్షుని బంధించి తమదేశంలో విచారణ జరుపుతామని అమెరికా అంటుందంటే ఐక్యరాజ్యసమితి ఉన్నట్టా, లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ చట్ట సవరణతో, రైతుచట్టంతో, లేబరుకోడ్స్ తో కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకొంటున్నదని తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, వి. సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

16 hours ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

16 hours ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago

శక్తి నిల్వపై విస్తృత శోధన

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వెల్లడించిన ఏఆర్ సీఐ శాస్త్రవేత్త డాక్టర్ బులుసు శారద మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శక్తి…

2 days ago

గీతంను సందర్శించిన డీఏవీ విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఐఐటీ హైదరాబాదు ప్రాంగణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్…

3 days ago