బొల్లారం
కోవిద్ వ్యాక్సినేషన్ వంద శాతం విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని మున్సిపల్ ఛైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వందం శాతం పూర్తి చేసిన వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నిరంతరం వ్యాక్సినేషన్ విజయవంతంకు కృషి చేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్ నర్స్ స్వరూప రాణిని , ఆశా వర్కర్లను , అంగన్ వాడీ సిబ్బంది సేవలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి కమిషనర్ రాజేంద్ర కుమార్ లు ప్రశంసించారు.వంద శాతం పూర్తయిన సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి విజయ సంకేతాన్ని చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు పట్టణ ప్రముఖులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్వోశ్రీధర్,హెచ్ఈఓవెంకటరమణ, వైద్య సిబ్బంది,ఆశా వర్కర్లు ,అంగన్ వాడీ వర్కర్లుపాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…