మనవార్తలు ,పటాన్చెరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన బిజెపి నేడు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయితే, ప్రధాని స్థాయి వ్యక్తులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో బీజేపీని తరిమికొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…