మనవార్తలు,పటాన్ చెరు:
విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని , అందుకు అవసరమైన వనరులన్నీ అందుబాటులోకి తెచ్చామని , ఈ ఏడాది చివరి నాటికి కనీసం పది స్టార్టప్లు గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి వస్తాయని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఆశాభావం వ్యక్తపరిచారు . ‘ ఆరంభ్ ‘ పేరిట అధ్యాపకుల కోసం వ్యవస్థాపకుల ప్రోత్సాహక దినోత్సవాన్ని గీతం హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , ఈ – క్లబ్ , వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ( వీడీసీ ) లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రొఫెసర్ డీఎస్ రావు సభాధ్యక్షత వహించారు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ , పారిశ్రామికులుగా విద్యార్థులు ఎదగడానికి అవసరమైన మౌలిక వసతులు , మార్గదర్శనం కల్పించామని , దాదాపు ఆరువేల పైచిలుకు విద్యార్థులు , 300 మంది నిబద్ధత గల అధ్యాపకుల మార్గదర్శనంలో కనీసం పది మంది స్టార్టప్లు నెలకొల్పడానికి ముందుకొస్తారని అభిలషించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిష్ నంగెగడ్డ మాట్లాడుతూ , తాము శ్రీకారం చుట్టిన ఈ ప్రక్రియ అనేక ఆవిష్కరణలు , స్టార్టప్లకు దారితీయగలదని ఆశాభావం వెలిబుచ్చారు . వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనేవారు , వ్యవస్థాపకులుగా ఎదిగే ఆలోచనతో పనిచేస్తారని , సవాళ్ళలో అవకాశాలను ఎతుక్కోగలరని , ఎటువంటి ఆటుపోట్లకు వెన్ను చూపబోరని స్పష్టీకరించారు . ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని , సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుకునే వారికి ఇదో నాందీ ప్రస్థావనగా ఆయన అభివర్ణించారు .
విద్య అనుభవపూర్వకంగా ఉండాలని , స్వీయ హస్తాలతో చేయడం ద్వారా నేర్చుకోవడానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు . బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం పనిచేస్తోందని , విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని తాము గీతమ్ కల్పించినట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య క్రిష్ ప్రకటించారు . టెక్టోరో నుంచి కిరణ్ కుమార్ , హెడ్రోఫోనిక్స్ప ఆర్కిటెక్చర్ అధ్యాపకురాలు బీఎన్ కీర్తినాయుడు వివరించారు .
తొలుత , వీడీసీ బెంగళూరు డిప్యూటీ డెరైక్టర్ మహేష్ వారియర్ ఈ కార్యక్రమ ఉద్దేశాలు , లక్ష్యాలను వివరించారు . వీడీసీ బృందంతో కలిసి గీతం సెనెస్ డీన్ ప్రొఫెసర్ బాల్కుమార్ , రీసెర్చ్ డెరైక్టర్ ప్రొఫెసర్ రాజా పి పప్పు అధ్యాపకులకు వర్క్షాప్ను నిర్వహించారు . మాస్టర్ క్లాస్ , వర్క్షాప్లు , పిచింగ్ సెషన్లు , ముఖాముఖి మార్గదర్శనం , విజయవంతమైన స్టార్టప్ల ప్రదర్శన , ఆటలతో సోమవారం నాడంతా గీతం ప్రాంగణం కోలాహలంగా కనిపించింది .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…