పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రపురం లోని శ్రీనివాస్ నగర్ కాలనీ బాలవిహార్ పార్క్ వద్ద తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత.తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని కొనియాడారు. నేటి తరానికి వారి చరిత్రను తెలిపేలా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం చాకలి ఐలమ్మ అసోసియేషన్ పెద్దలు,చాకలి నర్సింహా,చాకలి మల్లేష్,సమయ్య,నర్సింహా,యాదగిరి,ప్రభు,సాయి,శివ తదితరులు. ప్రజలు పాల్గొని ఘననివాళులర్పించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…