Telangana

చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని చిట్కుల్ లో ని ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. నిజాం రజాకార్ల నిరంకుశ పాలనలో వెట్టి చాకిరితో మగ్గిపోయిన బతుకులను బాగు చేయడానికి, బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆనాడు ఆమె చేపట్టిన ఉద్యమం అణచివేతను ప్రశ్నించేలా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో దేశంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ గ్రామంలో ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు.అదే ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యాన్ని ఆసరాగా చేసుకుని తాను సైతం ముందుకు వెళ్తున్నానని తెలిపారు. ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూ స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని వెల్లడించారు. ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తూ వారి ఆధారభిమానాలతో మరింత సేవ చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటేష్, మాజి సర్పంచ్ సుంకరి రవీందర్, మాజి ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వి నారాయణ రెడ్డి,పొట్టి నారాయణ రెడ్డి, కృష్ణ,మురళీ,వెంకటేశ్, సత్యా నారాయణ,బాబు, కిషోర్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago