Districts

కౌటిల్యా పబ్లిక్ పాలసీ విద్యార్థులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

 ఉద్యమకారుడు ప్రభుత్వాధినేత కావడమే తెలంగాణ అభివృద్ధికి కారణం

పటాన్ చెరు:

మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు కలలో కూడా ఊహించని పలు సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు చేసి చూపామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ అన్నారు . కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ‘ విధాన నిర్ణయాలలో నా అనుభవం ‘ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . స్వయాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు ప్రభుత్వాధినేత కావడం , ఆయనకు ప్రజలతో ఉన్న విస్తృ త సంబంధాలు , స్వీయ అనుభవాలు షాదీముబారక్ , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ( మర్యాద గృహం ) , పల్లెప్రగతి , ధరణి , రెడ్జుబంధు , రెక్జుభీమా , ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం వంటి పలు ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి పథకాల రూపకల్పన , అమలుకు దారితీసినట్టు చెప్పారు . పబ్లిక్ పాలసీని పూర్తిగా నిర్వచనం లేకపోయినా , అది వీలయినంత క్లుప్తంగా , సరళంగా , పారదర్శకంగా ఉంటేనే ప్రజల మెప్పు పొందుతుందన్నారు .

ఒక విధాన నిర్ణయం తీసుకునే టప్పుడు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని , కొంత రిస్క్ ఉన్నవాటిని సంబంధిత వర్గాలతో మాట్లాడాక ఒక అభిప్రాయానికి రావాలని , భవిష్యత్తులో తలెత్తనున్న న్యాయ సంబంధమైన అవరోధాలను కూడా ముందే ఊహించ గలిగి ఉండాలని సోమేశ్ సలహా ఇచ్చారు . ముఖ్యంగా ఒక విధాన నిర్ణయాన్ని ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నామో , దాని వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నామనే స్పష్టత విధాన రూపకర్తలకు ఉండాలని ఆయన స్పష్టీకరించారు .

ఉమ్మడి రాష్ట్రంలో , తన వృత్తిధర్మంలో భాగంగా రూపొందించిన మాబడితో సహా ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న పల్లెప్రగతి , ధరణి , గనుల తవ్వక విధానం వంటి పలు అనుభవాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యార్థులతో పంచుకున్నారు . ఉమ్మడి రాష్ట్రంలో విధాన నిర్ణయంపై అధిక్యత ప్రభావం చూపేదని , ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రంలో స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వగలుగుతున్నట్టు ఆయన చెప్పారు . తాను గిరిజనుల సంక్షేమ బాధ్యతలు చేపట్టినప్పుడు ‘ మాబడి ‘ పథకాన్ని రూపొందించానని , అది ఉన్నతాధికారుల మెప్పుపొంది చివరకు బహుళాదరణ పొందిన ప్రభుత్వ విధాన నిర్ణయం మారినట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు . ఆ పథకం కింద 404 మాబడులు నెలకొల్పి 16,544 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు అబ్బడానికి దోహదపడడమే గాక 7.15 లక్షల రూపాయల విరాళాలు ప్రజల నుంచి వచ్చినట్టు చెప్పారు .

పల్లెప్రగతి ‘ పేరిట తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం గ్రామీణాభివృద్ధి కార్యక్రమ ఫలాలు తెలంగాణలో ఉన్న 12,769 గ్రామాలలోని ఏ పల్లెకు వెళ్ళినా కనిపిస్తాయని , పరిశుభ్రత , ఆహ్లాదకరమైన పల్లె ప్రగతి వనాలు , నర్సరీ , డంపింగ్ యార్డులు , పక్షుంఠధామాల వంటివాటిని ఆయన వివరించారు . గ్రామ సర్పంచ్ , కార్యదర్శిలను బాధ్యులను చేస్తూ , వారికి అవసరమైన మౌళిక సదుపాయాలెన ట్రాక్టరు , ట్యాంకరు , ట్రాలీ వంటివన్నీ సమకూర్చడం వల్ల 85 శాతం లక్ష్యంతో వాటిని మొక్కలలో 95 శాతం బతికి , పచ్చదనాన్ని పంచుతున్నాయని , పలురకాల వ్యాధులను నివారించడమే కాక అటవీ విస్తీర్ణానాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు . ‘ రైతుబంధు ‘ పథకం కింద ఇప్పటివరకు ఆరు విడతల్లో 43 వేల కోట్ల రూపాయల నగదును పారదర్శకంగా , డిపాజిట్ చేసిన రెండో రోజునే లబ్ధిదారుడికి అందేలా చేసినట్టు సోమేశ్కుమార్ తెలిపారు .

రైతు భీమా ‘ కింద ఓ అర్హుడైన రెత్తు చనిపోయిన వారం రోజులలో ఐదు లక్షల రూపాయల నగదు ఆయన ఖాతాలో జమచేస్తున్నట్టు చెప్పారు . ధరణి వంటి పలు పథకాలు ఆదిలో విమర్శలు ఎదుర్కొన్నా , ఏడాదిగా విజయవంతంగా అమలు చేస్తున్నామని , క్రయ ఒప్పందం , ఆధార్ కార్డు , బయోమెట్రిక్ ఉంటే చాలా స్వల్ప వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తయి , మ్యుటేషన్ కూడా క్షణాల్లో జరిగిపోతోందని , కొనుగోలుదారు పాసు పుస్తకంతో సహా ఇంటికెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు . దీనివల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య అపరిమితంగా పెరిగినట్టు చెప్పారు .

గనులపై తాము రూపొందిస్తున్న విధాన నిర్ణయం త్వరలోనే చట్టరూపం దాల్చనుందని , దాని ద్వారా మరిన్ని పరిశ్రమలు తెలంగాణ స్థాపించడానికి వెసులుబాటు కలుగుతుందని , తద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు . విద్యా పథకాలపై ప్రభుత్వం భారీగానే వెచ్చిస్తున్న ఆ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఇతోధికంగా ఏర్పాటవుతున్నట్టు చెప్పారు . ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని విధానాలను సరళీకృతం చేయడం ద్వారా ప్రజలకు ఆ ప్రక్రియను సులువు చేయడంతో పాటు ప్రభుత్వ రాబడి కూడా పెరగడానికి దోహదపడినట్టు ఓ ప్రశ్నకు ప్రధాన కార్యదర్శి బదులిచ్చారు . తాను పూర్వ బీహార్ , ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సమీపం నుంచి రావడం వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను నిశతంగా పరిశీలిస్తుంటానని , పలు పథకాలు మంచి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు .

ఒకసారి రూపొందించిన విధాన నిర్ణయం అమలోకి వచ్చేలా ఉండాలని , అదే ఆయా పథకాల విధాన పత్రంగా కూడా మారాలని సోమేశ్కుమార్ అభిలషించారు . _ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థి కె.త్రిలోక్ అతిథిని పరిచయం చేయగా , గీతం అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీభరత్ , ఎం.భరద్వాజలు ఆయనను స్వాగతించారు . ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో కేఎస్పీపీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ , వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago