Telangana

సాంకేతికతపై అవగాహనా కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అధునాతన సాంకేతికతలపై అవగాహనా కార్యక్రమాన్ని ‘గిట్ సెట్ గో’ పేరిట తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే తమ తోటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ కార్యశాల ప్రత్యేకత.సైద్ధాంతిక అవగాహనకు మించి ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం, ఇందులో పాల్గొనేవారు వ్యక్తిగత ప్రాజెక్టుల కోసం గిట్ ని నమ్మకంగా ఉపయోగించడానికి, ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలకు దోహదపడటానికి సాధికారత కల్పించడంపై ఈ కార్యశాల దృష్టి సారించింది.

వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ (డీసీఎస్), సహకార సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో వాటి ప్రాముఖ్యత యొక్క అవలోకనంతో ఈ కార్యశాల ప్రారంభమైంది. గిట్ ఇన్ స్టాలేషన్, కాన్ఫిగరేషన్, రిపోజిటరీ సృష్టి, క్లోనింగ్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. తరువాత ఫోర్కింగ్ షేర్డ్ రిపోజిటరీలతో పనిచేయడం నేర్పించారు. గిట్ హబ్ విద్యార్థి అభివృద్ధి కోసం ఉద్దేశించడానికి గల కారణాలు, దాని ప్రయోజనం, వినియోగాలను వివరించారు. ఇందులో పాల్గొన్నవారికి ఆయా అంశాలపై స్పష్టత, సాంకేతిక అవగాహన ఏర్పడ్డాయి.

సీఎస్ఈ మూడో ఏడాది విద్యార్థులు సాయి గురు, హర్ష ఈ కార్యక్రమంలో ప్రధాన శిక్షకులుగా వ్యవహరించారు. దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని ఆయా సాంకేతికతలు, అధునాతన అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.

admin

Recent Posts

గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్…

13 hours ago

రన్ ఫర్ యూనిటీ 2K రన్‌లో పాల్గొన్న మాదిరి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన…

21 hours ago

మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావును పటాన్‌చెరు శాసనసభ్యులు…

21 hours ago

రన్ ఫర్ యూనిటీ 2K రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి…

21 hours ago

ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే మా లక్ష్యం

సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో సమీకృత భవనం…

21 hours ago

కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సిఐటియు

-పాశమైలారం లోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో సిఐటియు యూనియన్ ఏర్పాటు -బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల…

2 days ago