పటాన్ చెరు:
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు డాక్టర్ జితేంద్రను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…