యువతకు స్వామి వివేకానంద చూపిన మార్గం అనుసరణీయం : నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నేటి యువత స్వామి వివేకానందను చూసి నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఎంతో ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ లోని ZPHS స్కూల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ప్రపంచ దేశాలు గుర్తింపు పొందిన తత్వ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి పొందారని ఆయన తెలిపారు, దేశ భవిష్యత్తు యువతతోనే ఉందని ఆయన చెప్పిన మాటలు అక్షరాల సత్యం అని ఆయన తెలిపారు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడి సందేశం ఇచ్చే ప్రముఖ వ్యక్తిగా నిలిచారన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా కూడా అనేక సందర్భాల్లో ఆయన కలంతో హిందూత్వాన్ని చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…