Telangana

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి

మృతుల పట్ల పలు అనుమానాలు ?

మనవార్తలు , శేరిలింగంపల్లి:

భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. అంజయ్య స్వామి కూతురు సుజాత (37)ను ఇదే జిల్లాకు చెందిన నాగరాజు(42) కు 14 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. గత 7 సంవత్సరాల క్రితం భార్యా పిల్లలు సుజాత(37), సిద్దార్థ(11), రమ్యశ్రీ(8) లతో కలసి నగరానికి వలస వచ్చి పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 69, ప్లాట్ నెంబర్ 11 లో నివాసం ఉంటున్నారు. నాగరాజు టీవీఎస్ లూనాపై తిరుగుతూ కిరాణా షాపుల్లో మసాలాలు, ఇతర గృహావసర వస్తువులు సరఫరా చేస్తుంటాడు. అతని భార్య సుజాత ఇంటి దగ్గరే టైలరింగ్ పనిచేస్తూ డబ్బులు వడ్డీలకు ఇస్తూ ఉంటుందని తెలిపారు.

_ఉరికి వేళాడుతున్న నాగరాజు, హత్యకు గురైన సుజాత, సిద్ధూ, రమ్యశ్రీ

అయితే గత కొన్నాళ్లుగా నాగరాజు సుజాత దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకొని తరుచూ గొడవలు పడే వారని , కొద్ది రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు . శుక్రవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందిని, దీంతో భార్యా పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా భార్యా పిల్లలకు విషమిచ్చి, బ్రతికే ఉన్నారన్న అనుమానంతో టైలరింగ్ కత్తెరతో పొడిచి చంపాడని, అనంతరం తానూ ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి ఊరికి కానీ వెళ్తామని ఇటీవల చుట్టూ పక్కల వాళ్ళతో చెప్పారని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తలుపులు మూసి ఉండడం తో ఊరికి వెళ్లి ఉండొచ్చని వారు భావించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఏదో వాసనో స్తుందని అనుమానించిన వారు సోమవారం ఉదయం బయటి వైపు నుండి నిచ్చెన పైకి ఎక్కి కిటికీలో నుండి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ ను పిలిపించి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లొకి ప్రవేశించి ఆధారాలు సేకరించి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి కి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య స్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago