ప్రధాన శిక్షకులుగా పాల్గొన్న ఐఐటీ మద్రాసు, మహీంద్రా విశ్వవిద్యాలయాల ఆచార్యులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఆర్కిటెక్చర్ పై నిర్వహించిన వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ) విజయవంతంగా ముగిసింది. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగాలు సంయుక్తంగా ఈ ఎఫ్డీపీని హైబ్రిడ్ విధానం (ఆన్ లైన్, ఆఫ్ లైన్)లో నిర్వహించి, గీతం మూడు ప్రాంగణాల ఆచార్యులకు తగిన మార్గనిర్ధేశనం చేశారు.ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ మధు ముత్యం, మహీంద్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ భార్గవ రాజారాం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి వంటి ప్రముఖ నిపుణులు (రిసోర్స్ పర్సన్లు) విస్తృత శ్రేణి అంశాలను వారికి విశదీకరించారు. వీటిలో హార్డ్ వేర్ ఫండమెంటల్స్, మెయిన్ మెమరీ ఆర్కిటెక్చర్, ఇన్ స్ట్రక్షన్-లెవల్ ప్యారలలిజం, క్యాచి మేనేజ్మెంట్, సిస్టమ్ ఆఫ్టిమైజేషన్ టెక్నిక్ వంటివి ఉన్నాయి. వాటిపై లోతైన అవగాహన ఏర్పడేలా అభ్యాస అనుభవాన్ని గీతం అధ్యాపకులలో వారు మెరుగుపరిచారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, సీఎస్ఈ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ శాంతి చిలుకూరి, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, ఏఐ&డీఎస్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.శిరీష నేతృత్వంలో, డాక్టర్ యు.శ్రీనివాసరావు, శ్రీసౌమ్యల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. ఈ వారం రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో గీతం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంగణాలలోని 70 మంది అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఆయా ప్రాంగణాల మధ్య సమన్వయ సహకారాలతో పాటు విద్యాభివృద్ధిని కూడా పెంపొందించింది అనడంలో అతిశయోక్తి లేదు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…