నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు
పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇష్టపడి చదివి.. లక్ష్యాన్ని సాధించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్స్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వంగరి అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…