Telangana

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి

మనవార్తలు , నంద్యాల:

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి మ్రోగించార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ చంద్ర‌మౌళీశ్వ‌ర రెడ్డి ,డైరెక్ట‌ర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియ‌ర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కుల‌కు గాను 463 మార్కులు,కె.వీర పూజిత‌462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కుల‌తో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించార‌ని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబ‌డి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించార‌ని ప్రిన్సిప‌ల్ చంద్ర మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.బైపీసీ విభాగంలో ఈ.శివ‌నాగ‌లమ‌ల్లేశ్వ‌రి 440 మార్కుల‌కు గాను 423 మార్కులతో క‌ళాశాల టాప‌ర్ గా నిలిచార‌ని క‌ళాశాల యాజ‌మాన్యం తెలిపింది. బీ.రాఘ‌వేంద్ర నాయ‌క్ 408 మార్కుల‌తో రెండ‌వ స్థానం,సి.అమ‌ర్ నాథ్ 401 మార్కుల‌తో మూడ‌వ స్థానం సాధించార‌నట్లు చంద్ర‌మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు .

సీఈసీ విభాగంలో ఎం.చంద్రిక 476 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. బి.నాగేంద్ర 456 ,వి.నాగ‌ల‌క్ష్మీ 415 మార్కులు సాధించారు. క‌ళాశాల ప్రారంభం నుంచి జేఈఈ,నీట్ లాంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇవ్వ‌డం వ‌ల్లే ఈ ఫ‌లితాలు సాధ్య‌మైంద‌ని ..ఈ ఉత్త‌మ ఫ‌లితాల సాధ‌న‌కు కృషి చేసిన అధ్యాప‌క బృందానికి క‌ళాశాల యాజ‌మాన్యంకు అభినంద‌న‌లు  తెలిపారు .

admin

Recent Posts

గీతంలో అంతర్జాతీయ సదస్సు

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…

2 weeks ago

విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…

2 weeks ago

జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…

2 weeks ago

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…

2 weeks ago

మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్

ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…

3 weeks ago

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి కోకో క్రీడోత్సవాలు

-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…

3 weeks ago