_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
_టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ పై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులను ఫోటోగ్రాఫర్లకు అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి.శ్రీనివాస్, రాష్ట్ర సంఘము కోశాధికారి మునగాల శైలేందర్, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్ , ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్, కోశాధికారి గడ్డం లక్ష్మా రెడ్డి, స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…