మనవార్తలు ,పటాన్ చెరు:
క్రీడలు సమానత్వాన్ని బోధిస్తాయని , బృంద నిర్మాణం , క్రమశిక్షణ , పట్టుదల , న్యాయంగా ఉండడం , గౌరవించడం వంటి విలువలు క్రీడలలో పాల్గొనడం ద్వారా అలవడతాయని భారతీయ హాకీ పూర్వ కెప్టెన్ , ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఎండీ అండ్ సీఈవో విరెన్ రాస్క్విస్ట్గా అన్నారు . ‘ ఛేంజిమేకర్స్ ‘ సిరీస్లో భాగంగా బుధవారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని విద్యార్థులతో విరెన్ ముఖాముఖి నిర్వహించారు . విరెన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , తమ పాఠశాలలో క్రీడా సంస్కృతి ఉండేదని , క్రీడలను బాగా ప్రోత్సహించే వారని , అక్కడి హాకీ శిక్షకుడు ఒలింపియన్ అని విద్యార్థులకు చెప్పారు . తన కుటుంబ సభ్యులెవరూ క్రీడాకారులు కాకపోయినప్పటికీ , ఆటలపై తనకున్న ఆసక్తి భారత హాకీ జట్టు నేతృత్వం వహించేందుకు దోహదపడిందన్నారు .
తన కెరీర్ ఆరంభంలో ముంబయి హాకీ జూనియర్ జట్టు కెప్టెన్గా , 24 ఏళ్ళ తర్వాత తమ జట్టును ఫెనల్సుక్కు చేర్చానని , అది తన కెరీర్ను మలుపుతిప్పినట్టు ఆయన వివరించారు . తాను ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండాలనే ఆశిస్తానని , రెండో వాడిగా కాదని విరెన్ స్పష్టీకరించారు . ఒక జట్టులో ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమదేన పాత్రను పోషిస్తారని , నిభిన్న నెపుణ్యాలను కలిగి ఉంటారని , వాటిని గుర్తించి , తగు రీతిలో ప్రోత్సహించినప్పుడు అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తారని , అది విజయాలకు బాటలు వేస్తుందని విరెన్ పేర్కొన్నారు . సమయ పాలన గురించి చెబుతూ , తన 11 వ ఏట నుంచి కచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నానని , అలాగే తన విలువైన సమయాన్ని అటు ఆటలు , ఇటు చదువు కోసం ఏకకాలంలో సమర్థంగా వినియోగించుకున్నట్టు చెప్పారు . పూర్వం కంటే మనదేశంలో క్రీడా సౌకర్యాలు మెరుగయ్యాయని , మంచి శిక్షకులు కూడా అందుబాటులో ఉన్నట్టు విరెన్ తెలిపారు .
క్రీడలపై ఆసక్తి ఉన్నవారు సరైన బృందంలో , సరైన ఉద్దేశంతో , నిజాయితీగా కృషిచేస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు . చాలావరకు భారతీయ విశ్వవిద్యాలయాలు క్రీడలను పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణిస్తున్నాయే తప్ప , వాటిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించవంటూ తన అసంతృప్తిని వెలిబుచ్చారు . మనదేశంలో ప్రతిభావంతులకు కొదవలేదని , గ్రామీణ స్థాయి నుంచి శిక్షకుల నెపుణ్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు . విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు నడవాలని , శరీరాన్ని వంచి , మెలితిప్పే వ్యాయామాలు కొన్నయినా అభ్యాసం చేయాలని విరెన్ సూచించారు . తమ అభిరుచి మేరకు విద్యార్థులు ముందుకు సాగాలని , ఇష్టమైన దానిని తదేక దీక్షతో కొనసాగించాలని హితవు పలికారు . ఆరోగ్యకరమైన భారతం కోసం క్రీడా సంస్కృతిని పెంపొందించాలని నిరెన్ నొక్కిచెప్పారు . గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ఆవు విరెను సత్కరించగా , పాత్రికేయురాలు , కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విజిటింగ్ ఫ్యాకల్టీ స్మితా శర్మ సమన్వయం చేశారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…