– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు , స్టేషనరీ పంపిణీ
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
రుద్రారంలోని ప్రాథమిక – ఉన్నత పాఠశాలల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం నోట్బుక్స్ , పెన్నులు , పెన్సిళ్ళు , పెన్పెన్సిళ్ళు , రబ్బర్లు , షార్పనర్లు , స్కేళ్ళను పంపిణీ చేసింది . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ . ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ల నేతృత్వంలో , ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ సౌజన్యంతో , 2013 నుంచి ఆయా పాఠశాలల్లో గీతం నోటుకు పంపిణీ చేస్తున్న విషయం విదితమే . క్లాస్మేట్ నోట్ బుక్స్ , స్టేషనరీ సామగ్రిని తమ చిట్టి చేతుల్లో పట్టుకుని ఆయా పాఠశాలల విద్యార్థులు ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు కొత్త వాటిని ఉత్సుకతతో పరికించడం కనిపించింది . గీతం వర్సిటీ యాజమాన్యం , విద్యార్థుల ఉదారతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బహుదా ప్రశంసించారు . వినియోగించిన కాగితం పునర్ వినియోగం ప్రాముఖ్యత , విలువైన సహజ వనరుల సంరక్షణ , వ్యర్థాల పునరుత్పత్తి వంటి అంశాలను ఐటీసీ ప్రతినిధులు వివరించారు . గీతం హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటివ్ జె.మీనా , వెంచర్ డెవలప్మెంట్ సెల్ కోచ్ పార్థసారథి , ఐటీసీ ప్రతినిధులు , పలువురు విద్యార్థులు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…