Districts

ఎమ్మెల్యే జీఎంఆర్ ని కలిసిన శివశంకర్ రావు

మనవార్తలు ,పటాన్‌చెరు:

టీఆర్ఎస్ కెవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.వి.శివశంకర్ రావు ఈ నెల మే 1న తెలంగాణ ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డ్ అందుకున్న సందర్భంగా బుధవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన్ని అభినందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శివశంకర్ రావు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేయడం ఆయన సేవా తత్వానికి నిదర్శనం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మికులకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, పోచారం కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago