మరో ఎనిమిది గిన్నిస్ రికార్డ్ ల లక్ష్యంగా ప్రదర్శన
పటాన్‌చెరు:
ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో ఎనిమిది రికార్డులు లక్ష్యంగా మంగళవారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవ లతో కలిసి ఆరెగామీ పేపర్ తో రూపొందించిన 2,000 నెమళ్ళు, 1,600 కుక్కలు, 5,500 బూరెలు, 6,000 నిమ్మతొనలు, 20,000 చేపలు, 7,000 వేల్స్ తో పాటు 4,000 క్విల్లింగ్ దేవదూతలు, 3,200 క్విల్లింగ్ బొమ్మలను ఒకేచోట ఉంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.
ఆరెగామీ కాగితంలో రూపొందించిన వాటిని తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు. గీతం గణితశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డి.మల్లిఖార్జున రెడ్డి వాటికి లెక్కించి అధికారికంగా ధ్రువీకరించారు. గీతం డెరైక్టర్లు స్వతంత్ర న్యాయ నిర్ణేతలుగా ఈ ప్రదర్శనను స్వయంగా తిలకించి, ధ్రువీకరించిన పత్రాలను గిన్నిస్ అధికారులకు పంపి, వారి ఆమోదం తరువాత రికార్డును ఖరారు చేయనున్నారు.
శివాలీ ఇప్పటికే 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పిన విషయం విదితమే. తాజాగా లక్ష్యించిన మరో ఎనిమిది గిన్నిస్ రికార్డులను శివాలీ సాధించాలని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభిలషించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…