ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్‌చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈనెల 16 నుండి 18 తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా టీం అండర్ 14, అండర్ 17 కబడ్డీ బాలుర బాలికల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని తెలిపారు. 33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, 60 మంది కోచులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడోత్సవాలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా వాలీబాల్ కబడ్డీ అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 40 లక్షల రూపాయలు సొంత నిధులతో క్రీడోత్సవాల నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దిన్, ఎల్లయ్య, ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…