మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్. జగదీశ్వర్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యలమంచి ఉదయ్ కిరణ్, మహిళా ప్రెసిడెంట్ సునీత రెడ్డి, యూత్ నాయకుడు సౌoదర్య రాజన్, ఎం. సాంబశివ రావు లు పాల్గొని నవీన్ యాదవ్ గారి విజయానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రచారం చేశారు.ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలని వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలను మార్చుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువత కాంగ్రెస్ కార్యకర్తలు, మరియు పలువురు పార్టీ అభిమానులు ఘనంగా పాల్గొని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ఉత్సాహభరితమైన మద్దతు ప్రకటించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…