Telangana

మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పెడ్డికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల : మార్గదర్శి (రీసెర్చ్ గెడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం శక్తివంతమైన నిరోధకాలను గుర్తించి, ఆ ప్రతిపాదనలను డీఎస్ఎకి ఆమె సమర్పించారన్నారు. పరిశోధనలో సమకూరిన విజయాలు, సామాజిక ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నందుకు గాను ఆమెను మహిళా శాస్త్రవేత్తగా డీఎసిటీ ఎంపిక చేసినట్టు తెలిపారు.

డాక్టర్ కళ్యాణి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీని, హెదరాబాద్ జేఎన్టీయూ నుంచి పీహెచ్ డీ పట్టాను పొందారని, ఇప్పటివరకు దాదాపు 40కి పైగా పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమైనట్టు రాంబాబు పేర్కొన్నారు. గతేడాది కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన జాతీయ సదస్సులో డాక్టర్ కళ్యాణి సమర్పించిన పరిశోధనా పత్రం అత్యుత్తమైనదిగా ఎంపికైందన్నారు. క్యాన్సర్ చికిత్సలో రసాయనాల ప్రభావంపై డాక్టర్ కళ్యాణి ఐదు పుస్తకాలను ప్రచురించినట్టు తెలిపారు. రాబోయే తరాలకు క్యాన్సర్ వ్యాధి బారి నుంచి రక్షించే ఔషధాల రూపకల్పనే ధ్యేయంగా ఆమె పరిశోధనలను కొనసాగిస్తున్నట్టు డాక్టర్ రాంబాబు వివరించారు.

మహిళా శాస్త్రవేత్తగా ఎంపికెన డాక్టర్ కళ్యాణిని గీతం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, మరో పరిశోధనా మార్గదర్శి ప్రొఫెసర్ కె.ఎం. ప్రకాష్ తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…

3 hours ago

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…

22 hours ago

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…

2 days ago

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…

2 days ago

పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు

అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…

2 days ago