హైదరాబాద్
సిమ్ & సామ్ పార్టి ప్లే టౌన్ ఐదవ శాఖను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి న తార్నాక లోని స్పోర్ట్స్ స్క్వేర్ వద్ద ప్రారంభించారు.ఈ కొత్త శాఖ సర్కస్ థీమ్ ప్లే ఏరియా ఆధారంగా నిర్మిచంబడింది. ఇది హైదరాబాద్ లోనే కొత్త కాన్సెప్ట్, ఇది తమ పిల్లలు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు మరియు పిల్లల హృదయాలను గెలుచుకుంటుంది.
ఈ ప్లే టౌన్ ప్రారంభ సందర్భంగా శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో మొబైల్ మరియు ఆన్ లైన్ ఆటలకు బానిసలైన పిల్లలకు సరైన ఆట మైదానాలు లేవు మరియు కరోనా కారణంగా పిల్లలందరూ ఇంట్లో అతుక్కుపోయారు, ఈ పరిస్థితిలో సిమ్ & సామ్ వంటి గాడ్జెట్ ఫ్రీ ప్లే స్టేషన్లు పిల్లలు శారీరక ఆటలు ఆడటం ద్వార ఉపశమనం పొందటానికి సాహకరిస్తాయి, తార్నాక ప్రాంతంలో ఇటువంటి ప్లేటౌన్ ఉండటం మాకు సంతోషంగా ఉంది, అని ఆమె అన్నారు.
సిమ్ & సామ్ (పార్టీ మరియు ప్లేటౌన్) 100% గాడ్జెట్ ఫ్రీ ప్లే జోన్ అని సిమ్ అండ్ సామ్ (పార్టీ & ప్లేటౌన్) ఎండి సుమిత్ అహుజా తెలిపారు. ఈ కొత్త బ్రాంచ్ లో ట్రాంపోపోలిన్స్, నెట్ క్రికెట్, స్టిక్కీ వాల్, టార్జాన్ స్వింగ్స్, డోనట్ స్లైడ్స్, రౌండ్-క్లైంబింగ్ టవర్, మంకీ బ్రిడ్జ్ మరియు సర్కస్ థీమ్ పార్టీ హాల్ తో పాటు స్పైరల్ స్లైడ్లు ఉన్నాయని ఆయన చెప్పారు.క్లైంబ్ ది జోకర్, జిప్పింగ్ ఫాస్ట్ సర్కస్ స్లైడ్, రోలింగ్ ఛైయిర్స్, బ్రెయిన్ టీజింగ్ వాల్ గేమ్స్ కూడా అందులో భాగమని ఆయన చెప్పారు.
ఫన్ పార్క్ సిమ్ అండ్ సామ్ ప్రతిరోజూ ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ గాడ్జెట్ రహిత వాతావరణం కల్పించామని ఇక్కడి సరదా ఆటలు పిల్లల ఆనందాన్ని పెంచుతాయన్నారు.”భవిశ్యత్తు సవాళ్లను స్వీకరించడానికి ఆరోగ్యకరమైన మరియు శారీరకంగా బలమైన తరాన్ని తీసుకురావడమే మా లక్ష్యమని, మా ప్లే ప్రాంతం అటువంటి శరీరక చర్యలను సులభతరం చేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు మరియు పరికరాలను అందిస్తుందని సుమిత్ అహుజా అన్నారు.ఈ కార్యక్రమంలో టిటియుసి స్టేట్ ప్రెసిడెంట్ మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…