Telangana

శాంతా సిన్హా , అంపశయ్య నవీన్ కు – గీతం గౌరవ డాక్టరేట్లు

– ఈనెల 30 న నిర్వహించే గీతం 13 వ స్నాతకోత్సవంలో ప్రదానం

– ముఖ్య అతిథిగా సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 13 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 న నిర్వహించనున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ( డీ.లిట్ ) ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలియజేశారు .

హైదరాబాద్ లోని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని , స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు . గీతం విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాతకోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపారు .

ఈ పదమూడో స్నాతకోత్సవంలో 1,346 మంది విద్యార్థులు పట్టాలను తీసుకోవడానికి అర్హత సాధించారని , అందులో , బీఏ , ఎంఏ , బీబీఏ , బీకాం , ఎంబీఏ , బీఎస్సీ , ఎమ్మెస్సీ , బీటెక్ , ఎంటెక్ , బీఫార్మశీ విద్యార్థులున్నట్టు ప్రోవీసీ పేర్కొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago