Telangana

బంధంకొమ్ము లో ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర

సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్:

సమ్మక్క సారలమ్మల కృపతో పటాన్‌చెరునియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ములో గల సమ్మక్క సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు పాల్గొని అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనం పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం వెళ్లలేని భక్తుల కోసం బంధం కొమ్ములో స్వయం భూగ వెలసిన అమ్మవార్లకు ప్రత్యేక గద్దెలు నిర్మించి గత రెండు దశాబ్దాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

18 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

18 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

18 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

18 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago