Telangana

గ్రామీణ జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఐనోలులో ఘనంగా మల్లన్న స్వామి జాతర

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఐనోలులో గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు సొంత నిధులతో దేవాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

51 minutes ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago